ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి గ్రామంలో ‘అన్నదాత సుఖీభవ’, ‘పీఎం కిసాన్’ పథకాల రెండో దశ నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా పొలంలో చెట్టు
కింద రైతులతో సమావేశం అయ్యారు. ఆర్థిక నష్టాలతో బాధపడిన రాష్ట్రాన్ని ‘డబుల్ ఇంజన్ ప్రభుత్వం’ ద్వారా త్వరగతిలో ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. “ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మేము రైతులకు వాగ్దానాలు నెరవేరుస్తున్నాము” అని స్పష్టం చేశారు.

