
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు ఉన్న వీడియో వైరల్ కావడం.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. తన హత్యకు ప్లాన్ చేస్తూ రౌడీషీటర్లు మాట్లాడుకున్న వీడియో వైరల్ కావడంతో దానిపై చర్చించేందుకు నెల్లూరు రూరల్ టీడీపీ కార్యాలయంలో తన తమ్ముడు గిరిధర్ రెడ్డి సహా ముఖ్య అనుచరులతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేశారు.