
ప్రతిపక్ష వైఎస్సార్ సీపీపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఐదేళ్లలో ఏమాత్రం అభివృద్ధి చేయనివారంతా.. పీపీపీ మోడల్‌పై కొత్త నాటకాలకు తెరలేపారని విరుచుకుపడ్డారు. గతంలో వైద్య కళాశాలల అభివృద్ధికి వారు చేసిందేమీ లేదని.. ఇప్పుడు మాత్రం అధికారంలోకి రావాలనే ఉబలాటంతో ఏవేవో ఊహించుకుంటూ మాట్లాడుతున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హిందూపురం నియోజకవర్గం
నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఇంకా అధికారంపై యావతో ఉన్నారన్నారు.