“జల్లికట్టు అంటే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కాదు, ఎవరంటే వారు, ప్రైవేట్ వ్యక్తులు దీనిని నిర్వహించడానికి కుదరదు” అని మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం తేల్చిచెప్పింది.అవనియాపుర గ్రామస్థులు జల్లికట్టు నిర్వహణ గ్రామ కమిటీకే అప్పగించాలి అని హైకోర్టులో వేసిన పిటిషన్ పై ,తమిళనాడు సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ సంప్రదాయ క్రీడను నిర్వహించే అధికారం కేవలం ప్రభుత్వానికి మాత్రమే ఉందని స్పష్టం చేసింది. మధురై జిల్లాలోని ప్రపంచ ప్రఖ్యాత అవనియాపురం, పాలమేడు, అలంగనల్లూర్ జల్లికట్టు వేడుకలను ప్రభుత్వమే దగ్గరుండి జరపాలని ఆదేశించింది.

