
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో వివాదంపై పొన్నం ప్రభాకర్ స్పందించారు. అడ్లూరి తనకు సోదరుడిలాంటి వారని తెలిపారు. కాంగ్రెస్‌లో మాకు 30 ఏళ్ల స్నేహబంధం ఉందని అన్నారు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం విడదీయరానిది అని అన్నారు. అడ్లూరి లక్ష్మణ్‌పై ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేశారని అన్నారు. అడ్లూరి బాధపడ్డారని తెలిసి తీవ్రంగా విచారిస్తున్నానని అన్నారు. అడ్లూరి మనసు నొచ్చుకుని ఉంటే చింతిస్తున్నానని చెప్పారు.