
గత నెలలో డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్‌లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా.. కింగ్ చార్లెస్‌కు బహుమతిగా ఇవ్వడానికి లైబ్రరీలో ఉన్న ఒక ముఖ్యమైన చారిత్రక కత్తిని అందించాలని ట్రంప్ పరిపాలన కోరగా.. అందుకు లైబ్రరీ డైరెక్టర్ టాడ్ ఆరింగ్టన్ నిరాకరించారు. నిజమైన చారిత్రక కత్తిని ఇవ్వడానికి ఆరింగ్టన్ నిరాకరించడం ట్రంప్ పరిపాలనాధికారులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఉన్నతాధికారులు ఫోన్ చేసి రాజీనామా చేయాలని లేకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని తేల్చిచెప్పారు. దీంతో ఎట్టకేలకు ఆరింగ్టన్ రాజీనామా చేశారు.