
గిరిజన గ్రామాలలో రోడ్ల సౌకర్యం లేక గర్భిణీలను డోలీలు కట్టుకొని ఆసుపత్రులకు తీసుకు వెళ్లిన అనేక ఘటనలు మనం చూసాం. అయితే అటువంటి పరిస్థితి గిరిజన గ్రామాల్లో ఉండకుండా అడవితల్లి బాట పేరుతో రోడ్లను అభివృద్ధి చేయాలని సంకల్పించింది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండురోజుల పాటు గిరిజన గ్రామాలలో పర్యటించనున్నారు. నేడు, రేపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.