మోనాలిసా వివాహం చేసుకున్న సమయానికి ఆమె వయస్సు చట్టప్రకారం తక్కువగా ఉండటంతో పోలీసులు సీరియస్ అయ్యారు. ఆమె భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదు కావడంతో మోనాలిసా మరియు ఫర్మాన్ ఖాన్ ఇద్దరూ పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ జంట ప్రస్తుతం కేరళలో తలదాచుకుని ఉండవచ్చని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

