
మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ సమన్వయ సమావేశం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు మనపై బాధ్యత పెట్టారని, కష్టపడి ప్రజాసమస్యలు పరిష్కరించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
మచిలీపట్నం అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే మచిలీపట్నం. ఇక్కడ ఎప్పుడైతే గెలిచామో అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా విజయం సాధించాం. నేను ఈ రోజు మచిలీపట్నం వస్తుంటే అడుగడుగునా పోలీసులు ఉన్నారు.
మనపై అక్రమ కేసులు పెట్టిన వారే మనకు సెల్యూట్ కొట్టారంటే అదీ ప్రజాస్వామ్య గొప్పదనం.