
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) 2026కి అప్లై చేయాలనుకునే వారికి గుడ్న్యూస్. గేట్ 2026 రిజిస్ట్రేషన్ గడువును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) గౌహతి పొడిగించింది. అభ్యర్థులు ఎలాంటి లేటు ఫీజు లేకుండా 2025 అక్టోబర్ 6 వరకు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. ఈ గడువు దాటితే, 2025 అక్టోబర్ 9 వరకు లేట్ ఫీజుతో అప్లై చేసుకోవచ్చు. గేట్ 2026 ఎగ్జామ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీలలో జరుగుతుంది.