అక్కినేని అఖిల్ (జననం. ఏప్రిల్ 8 1994) భారతీయ సినిమా నటుడు. ఆయన ప్రముఖ సినిమా నటులైన అక్కినేని నాగార్జున, అమల అక్కినేని ల కుమారుడు. ఆయన సినీ పరిశ్రమలో తన బాల్యంలోనే ఒక తెలుగు హాస్య సినిమా అయిన సిసింద్రీతో ప్రారంభించాడు. అప్పటికి అతని వయస్సు ఒక సంవత్సరం. అఖిల్ ఏప్రిల్ 8, 1994 న కాలిఫోర్నియా లోని సాన్ జోస్ లో జన్మించాడు.

