భారతదేశపు దిగ్గజ సంగీతకారుడు శంకర్ మహదేవన్ దేశభక్తి గీతాలు పాడుతూ, భారత సైన్యానికి నీరాజనం పలికారు. నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. శంకర్ మహదేవన్ కుమారులు శివం, సిద్ధార్థ్ మహదేవన్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఆయన భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ పాడినప్పుడు, మైదానంలో ఉన్న వేలాది మంది ఆయనతో పాటు హమ్ చేశారు శంకర్ మహదేవన్, అతని బృందాన్ని హర్ష భోగ్లే స్వాగతించారు. దీంతో ముగింపు వేడుక ప్రారంభమైంది.

