భారత కరెన్సీ రూపాయిని నిర్దిష్ట స్థాయిలో ఉంచాలనే లక్ష్యమేదీ తమకు లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. అమెరికా డాలరుకు భారీ డిమాండ్ పెరిగినందు వల్లే ఇటీవలె భారత రూపాయి విలువ తగ్గుముఖం పట్టిందన్నారు. ఆర్బీఐ వద్ద సరిపడా విదేశీ మారక నిల్వలు ఉన్నాయని, విదేశీ వాణిజ్యం, అంతర్జాతీయ లావాదేవీల విషయంలో ఎలాంటి ఆందోళన అక్కర్లేదని ఆయన తేల్చి చెప్పారు. అమెరికా దేశంతో వాణిజ్యానికి ఏర్పడిన అవాంతరాల వల్లే రూపాయి విలువ తగ్గిందని చెప్పారు.

