
అందాల పోటీలకు రూ.200 కోట్లు ఉంటాయి. కానీ చేప పిల్లల పంపిణీకి రూ100 కోట్లు లేవా అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం ముదిరాజ్‌లను ఉద్ధరించిందేమీ లేదని, ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర దాటుతున్నా చేప పిల్లలు ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు. కెసిఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం రూ.120 కోట్లు ఖర్చు చేసి ఉచితంగా చేప పిల్లలు, రొయ్యల్ని చెరువుల్లో, ప్రాజెక్టులలో పోసిందని గుర్తు చేశారు.