
అచ్చంపేట ఐసీడీఎస్ క్లస్టర్‌లో అచ్చంపేట అమ్రాబాద్, మండలాలలో మొత్తం 195 అంగన్వాడి సెంటర్లు కొనసాగుతున్నాయి. అంగన్వాడీ సెంటర్లలో ఎగ్ బిర్యానీ, అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని కూడా టీచర్ల నుండి డబ్బులు వసూలు చేసి కార్యక్రమం చేపట్టినట్లు సమాచారం. కావున పై అధికారి సూచనతోనే ప్రతి అంగన్వాడీ టీచర్ నుండి రూ. 1200, ప్రతి ఆయా నుండి రూ. 300 చొప్పున దాదాపు నాలుగు లక్షల రూపాయలు వసూలు చేశారు.