ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ఏఐ చాట్‌బాట్ గ్రోక్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. మహిళల ఫొటోలను అశ్లీలంగా మార్చాలని ప్రాంప్ట్ ఇస్తే, గ్రోక్ వాటిని అశ్లీల చిత్రాలుగా మార్చుతుండటం వివాదాస్పదమవుతోంది. దీంతో మహిళల మార్ఫింగ్ ఫొటోలు సామాజికమాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆందోళన వ్యక్తం చేశారు. అసభ్యకరమైన ట్రెండ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రికి ప్రియాంక చతుర్వేది విజ్ఞప్తి చేశారు. మరోవైపు గ్రోక్లో రిమూవ్ దిస్ పిక్చర్ పేరిట మరో ట్రెండ్ కూడా మొదలైంది.

