
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ) 2025 నోటిఫికేషన్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) ఎగ్జామినేషన్ 2025లను తాజాగా విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ కేంద్ర సర్వీసులకు చెందిన దాదాపు 979 సివిల్ సర్వీసెస్ పోస్టులను ఈ ఏడాది భర్తీ చేయనున్నారు. వీటితోపాటు 150 ఐఎఫ్ఎస్ సర్వీస్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన జారీ చేశారు. డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్ధులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.