పాకిస్తాన్కు ఓ ముస్లిం దేశమే గట్టి షాక్ ఇచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాకిస్తానీలు దేశంలోకి ప్రవేశించకుండా నిషేధించింది. యుఎఇలో పెరుగుతున్న నేరాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆదేశ అధికార వర్గాలు తెలిపాయి.
పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు అంతర్గత కార్యదర్శి సల్మాన్ చౌదరి యుఎఇ పాకిస్తానీలకు వీసాలు జారీ చేయడం లేదని పేర్కొన్నారు. పాకిస్తాన్ సెనేట్ మానవ హక్కుల కమిటీ అధిపతి సమీనా ముంతాజ్ జెహ్రీ మాట్లాడుతూ, పాకిస్తానీయులు యుఎఇలో నేరాలకు పాల్పడుతున్నారని, అందుకే వీసాలు నిరాకరిస్తున్నారని అన్నారు.

