తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఫ్రీ అయిందని, ఇప్పుడు ఎవరైనా ఆ పేరును వాడుకోవచ్చని అన్నారు. తమ పార్టీ ఆచార్య జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే నడుస్తుందన్నారు. తమ పార్టీకి బిహార్ సిద్ధాంతకర్త ఎవరూ లేరన్నారు. బీఆర్ఎస్ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని విమర్శించారు.

