వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకత్వంలో అంతర్గత కలహాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ముందు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి హాజరై, తనపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇచ్చారు. కొండా మురళి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈ కొత్త కాంట్రావర్శీకి కారణమయ్యాయి. కొండా దంపతులైన కొండా మురళి, కొండా సురేఖ.. కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తున్నారనీ, స్థానిక నాయకులను అణచివేస్తున్నారని.. అసంతృప్త నేతలు ఆరోపిస్తూ ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు.

