
సాఫ్ట్‌వేర్ రంగం అనిశ్చితిగా మారుపేరుగా మారిపోతుంది. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఎన్ని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయో అంత కంటే ఎక్కువ ఉద్యోగాలు కూడా పోతున్నాయి.భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2026 ఆర్థిక సంవత్సరంలో తన ఉద్యోగులను 2 శాతం తగ్గించుకోనుంది.ఈ ప్రక్రియలో భాగంగా దాదాపు 12,200 ఉద్యోగాలను తొలగించనున్నట్లు తెలిపింది. “మా క్లయింట్లకు అందించేసేవలపై ఎటువంటి ప్రభావం ఉండకుండా చూసుకోవడానికి ఈ ప్రక్రియను తగిన జాగ్రత్తతో ప్లాన్ చేస్తున్నాం” అని కంపెనీ వెల్లడించింది.