వరంగల్ చపాటా మిర్చికి అంతర్జాతీయ గుర్తింపు
వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు లభించింది. ప్రపంచ స్థాయిలో జియోగ్రాఫికల్ ఇండికేషన్(జీఐ) ట్యాగ్‌ను సాధించింది. మల్యాల జేవీఆర్ పరిశోధనా స్థానం, హార్టికల్చర్ యూనివర్సిటీ కలిసి చపాటా మిర్చి పంటపై అనేక పరిశోధనలు చేసి రైతులకు లాభాలు వచ్చేలా రిసెర్చ్ చేసి పంపించామని దాని ఫలితంగా చపాటా మిర్చికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని మల్యాల (జేవీఆర్) శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన కళాశాల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కత్తుల నాగరాజు ర్కొన్నారు.