రెవెన్యూ దందా..!
సంతనూతలపాడు మండల రెవెన్యూ కార్యాలయం అవినీతిలో కూరుకుపోయింది. భూములకు సంబంధించిన వ్యవహారాల్లో రెవెన్యూ అధికారులకు కాసుల పంట పండుతోంది. ఎకరా భూమి ఆన్‌లైన్ చేయాలంటే రూ.40 వేల వరకు వసూలు. బాబూరావు అలియాస్ బోసుబాబు గత జనవరి మార్చి 4వ తేదీ వరకు తన స్థలానికి పొజిషన్ ధ్రువీకరణ పత్రం కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా మంజూరుచేయలేదు. విసిగిపోయిన అతను తహసీల్దార్ కారుకు అడ్డుగా నిరసన తెలిపారు. చివరకు పోలీసుల చేత అతనిని ఆందోళనను నిలిపివేయించారు.