ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలు కిటకిట
మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలు ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడాయి. ప్రధానంగా అరకు ఉత్సవ్ జరుగుతుండడంతో ఏజెన్సీలోని పలు పర్యాటక ప్రదేశాలను తిలకిస్తూ సాయంత్రానికి అరకులోయ చేరుకుని ఉత్సవ్‌లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు ఆసక్తి కనబరిచారు. అనంతగిరి మండలం బొర్రా గుహలు, కటిక, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జల విహారి, తారాబు జలపాతం, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి, చెరువులవేనం, లంబసింగి ప్రాంతాలు రద్దీగా […]