టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు కొత్త పదవి..
టీడీపీ ఎంపీ, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలుకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఆంధ్రప్రదేశ్ కమిటీ ఛైర్మన్‌గా లావు శ్రీకృష్ణదేవరాయలును కేంద్రం నియమించింది. ఏపీకి సంబంధించిన ఆహార ధాన్యాల సేకరణతో పాటు ఆహార ధాన్యాల నిల్వ, పంపిణీ వంటి అంశాలను చూసే ఎఫ్‌సీఐ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఎఫ్‌సీఐ ఆంధ్రప్రదేశ్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, పరిస్థితులను సమీక్షించనున్నారు.