ఎన్టీఆర్ జిల్లాలో బెల్ట్ షాపుల హవా.. బడ్డీకొట్లలో భారీగా మద్యం అమ్మకాలు
ఎన్టీఆర్ జిల్లాలో అనధికార బెల్ట్ షాపుల హవా నడుస్తోంది. బడ్డీకొట్ల ముసుగులో భారీగా మద్యం అమ్మ కాలకు తెరలేపుతున్నారు. అధికారులు సహకరిస్తుండటంతో నిన్న, మొన్నటి వరకు ఇళ్లలో రహస్యంగా నిర్వహించిన బెల్ట్ షాపులు నేడు యథేచ్ఛగా సాగుతున్నాయి. విచ్చలవిడి బెల్ట్ షాపులపై ప్రజలు తిరుగుబాటు చేస్తుండగా, అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మైలవరం, తిరుపూరు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని గ్రామాల్లో అనధికార బెల్ట్ షాపులు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి.