సైకిల్‌పై వెళ్లి.. సమస్యలు తెలుసుకొని
మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదివారం ఉదయం తన భార్యతో కలిసి మెదక్ జిల్లాకేంద్రం నుంచి సైకిల్‌పై బయలుదేరి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాయంపేట పట్టణానికి చేరుకున్నారు. స్థానిక బస్టాండ్‌ను సందర్శించి ప్రయాణికుల సమస్యలు అడి గి తెలుసుకున్నారు. బస్టాండ్‌లో మహిళా ప్రయాణికులతో మాట్లాడి మహాలక్ష్మి పథకం అమలు గురించి ఆరాతీశారు. అనంతరం తన సతీమణితో కలిసి బస్సు లో టికెట్ తీసుకొని మెదక్‌కు ప్రయాణించారు. ఇటీవల కలెక్టర్ దంపతులు పొలాలను సందర్శించి వరినాట్లు వేశారు.