ఇలాంటి పేద మహిళకు న్యాయం చేయలేని అధికారులు
ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం రేపల్లెవాడ గ్రామానికి చెందిన బందెల అన్నమ్మ గత ఏడాది తుఫాన్‌తో రేకుల షెడ్డు కూలిపోవడంతో.. ఆమె ప్రస్తుతం మరుగుదొడ్లో నివాసం ఉంటూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకంతో సంబుర పడ్డ పేదలంతా దరఖాస్తు చేసుకున్నారు. ఊళ్లో అర్హులైన వారందరి పేర్లతో 95 మంది జాబితా ఉన్నతాధికారులకు పంపారు. కానీ సాంకేతిక కారణాలతో నిరుపేద వృద్ధురాలు అన్నమ్మ పేరును అర్హులు జాబితా నుంచి తొలగించారు.