పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
రేపు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంగారెడ్డి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెదక్ -కరీంనగర్ -నిజామాబాద్ -ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇంకా ఒక్కరోజు మిగిలి ఉండడంతో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరికివారే గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.