స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్
ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరోసారి సత్తా చాటింది. నూతన ఏడాదిలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇటీవల ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్పేస్ డాకింగ్ ఎక్స్‌పర్‌మెంట్ (స్పేడెక్స్) విజయవంతమైంది. నింగిలో రెండు ఉపగ్రహాల అనుసంధానం విజయవంతంగా పూర్తయింది. ఈ మేరకు ఇస్రో ‘ఎక్స్’లో గురువారం వెల్లడించింది. ‘అంతరిక్ష చరిత్రలో భారత్ తన పేరును లిఖించుకున్నది.