తోలుబొమ్మల కళ అద్భుతం. . . కళాకారుడికి రాష్ట్రపతి ప్రశంస
ధర్మవరం మండలంలోని నిమ్మలకుంట గ్రామానికి చెందిన దళవాయి కుళ్లాయప్ప రూపొందించిన తోలుబొమ్మలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవనలో ఏర్పాటు చేసిన వివిధత కా అమృత మహోత్సవంలో దళవాయి కుళ్లాయప్ప తోలుబొమ్మలతో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. స్టాల్‌ను సందర్శించిన రాష్ట్రపతి తోలుపై గీసిన రామయాణ, భారత ఘట్టాలను పరిశీలించారు. అద్భుతం అంటూ ప్రశంసించారు. ప్రాచీన కళను కాపాడుకోవాలని రాష్ట్రపతి సూచించినట్లు దళవాయి కుళ్లాయప్ప తెలిపారు.