ప్రత్యేక ఓటరు జాబితా సవరణకు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ కోల్‌కతాలో భారీ ప్రదర్శన నిర్వహించింది. ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ సారథ్యంలో ఈ ర్యాలీ జరిగింది. E.C.ని పూర్తిగా రాజీపడిన సంస్థగా, SIRను మోసపూరితపనిగా TMC అభివర్ణించింది. BJP, ఎన్నికల సంఘం కలిసి జరిపే కనిపించని నిశ్శబ్ద రిగ్గింగ్ అని పేర్కొంది. మొత్తం 3.8 కిలోమీటర్ల మేర ఈ మార్చ్ కొనసాగిన ఈ ర్యాలీతో ఆ దారులన్నీ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలతో నిండిపోయాయి.

