
బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారికి ఎస్బీఐ శుభవార్త చెప్పింది. 541 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పరీక్షకు అర్హత కలిగిన వారు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆసక్తిగలవారు జూలై 14, 2025 వరకు అధికారిక వెబ్సైట్ (sbi.co.in) ద్వారా అప్లై చేసుకోండి. మొత్తం 541 ఖాళీలు ఉన్నాయి ఉండగా.. ఇందులో 500 రెగ్యులర్, 41 బ్యాక్లాగ్ ఖాళీలకు ఎస్బీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది.