హైదరాబాద్ నగరం చుట్టూ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (RRR)ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించే ఉద్దేశంతో, దీనిని ‘ఎక్స్‌ప్రెస్‌వే’ హోదా నుండి సాధారణ జాతీయ రహదారి స్థాయికి కుదిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.గతంలో 8-Lane గా ప్రతిపాదించిన రోడ్డును ఇప్పుడు 6-Lane గా పరిమితం చేశారు. నిధుల పొదుపు కోసం సర్వీస్ రోడ్ల ప్రతిపాదనను ఈ ప్రాజెక్టు నుంచి పూర్తిగా తొలగించడం గమనార్హం. అంతేకాకుండా, వంతెనలు, అండర్ పాస్‌లు మరియు ఇంటర్‌ఛేంజ్‌ల సంఖ్యను కూడా దాదాపు 50 శాతం మేర తగ్గించారు.

