కర్నూలుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గార్గేయపురంలో 1988లో ప్రభుత్వం భూ యజమానుల నుంచి భూమిని సేకరించింది. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే భూమి యజమాని రామకృష్ణమ్మకు చెల్లించాల్సిన రూ.18,72,288 పరిహారం ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించలేదు. ఆమె చివరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం కూడా పలుమార్లు ఆదేశించినప్పటికీ, అధికారుల నుంచి చలనం లేకపోవడంతో కోర్టు ఆర్డీవో వాహనాన్ని నెల 12న వేలం వేయాలని, వేలంలో వచ్చిన మొత్తాన్ని బాధితురాలికి చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

