
RCB జట్టు ఐపీఎల్ 2025 ఫైనల్ చేరినప్పటి నుంచి ‘ఈ సాలా కప్ నమదే’ (ఈ ఏడాది కప్ మనదే) అని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కెనడియన్ రాపర్, గ్రామీ అవార్డు విజేత అయిన డ్రేక్ RCBకి వీరాభిమాని. ఆర్సీబీ జట్టు విజయం సాధిస్తుందని దీమాగా ఉన్నాడు. RCB ఐపీఎల్ ఫైనల్ గెలుస్తుందని 750,000 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు 6,41,08,974 రూపాయలు) పందెం వేశానని తెలిపాడు.