ప్రకాశంజిల్లా గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం అమ్మకానికి ఉందంటూ ఓ వ్యక్తి OLXలో పోస్ట్ పెట్టాడు. ప్రభుత్వ కార్యాలయం అమ్మకానికి పెట్టడం ఏంటి అని అనుకుంటున్నారా.అవును కార్యాలయం ఫోటోని యాప్ లో అప్లోడ్ చేసి 20 వేల రూపాయలకు అమ్ముతున్నట్లు పోస్ట్‌లో పేర్కొన్నాడు.గత రెండు రోజులుగా ఈ ఫోటో ఓఎల్ఎక్స్ లో చక్కర్లు కొడుతూ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ పోస్టింగ్‌పై సమాచారం అందుకున్న గిద్దలూరు రెవెన్యూ అధికారులు ఖంగుతిన్నారు. వెంటనే తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు గిద్దలూరు తహసీల్దార్ ఆంజనేయరెడ్డి.

