నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ కార్యకర్త ఆవుల రెడ్డి వీడియో వైరల్ అవుతోంది. తన పదవి నుంచి వైదొలగాలని.. స్థానిక నాయకుడు, మాజీ మున్సిపల్ ఛైర్మన్ భర్త నాగరాజు తనపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఆవుల రెడ్డి హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం శిరివరం సాగునీటి సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన మంగళవారం రాత్రి ఆవులరెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి తల బాదుకొని, విగ్రహానికి మొరపెట్టుకున్నారు.

