
ప్రకృతి సృష్టించిన విపత్తు నుంచి మయన్మార్‌ను కోలుకునేందుకు భారత్ సహాయ కార్యక్రమాలు చేపట్టింది. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో చేపట్టే సహాయక చర్యల్లో భాగంగా రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బంది, నావికాదళ నౌకలను ఆదేశానికి పంపించింది. మానవతాదృక్పథంతో మయన్మార్ రాజధాని నేపిటావ్‌కు రెస్క్యూ బృందాన్ని పంపిన మొదటి దేశం భారతదేశం అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) శనివారం పేర్కొంది.