తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగకముందే రాజకీయ వేడి రాజుకుంది. ముఖ్యంగా దళపతి విజయ్ నేతృత్వంలోని తమిగళ వెట్రి కజగంపైనే అందిరి దృష్టి నెలకొంది. ఎన్డీఏతో పొత్తు ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో విజయ్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఎన్డీఏ కూటమితో పొత్తుకు ఎటువంటి ఆస్కారం లేదని స్పష్టం చేసింది. ఈ విషయమై జరుగుతున్న చర్చలను కేవలం ఊహాగానాలుగా మాత్రమే అని కొట్టిపారేసింది.

