
NCERT ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో జైసల్మేర్ రాజ కుటుంబం గురించి తప్పుగా ఉన్న సమాచారంపై పెద్ద వివాదం చెలరేగింది. NCERT 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలోని యూనిట్ 3, పేజీ నంబర్ 71లో ఉన్న
ఒక మ్యాప్ జైసల్మేర్‌ను మరాఠా సామ్రాజ్యంలో భాగంగా చూపించారని, ఇలాంటి నిరాధారమైన, చారిత్రకంగా తప్పుగా ఉన్న సమాచారం ఎన్సీఈఆర్టీ వంటి సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తుందని చైతన్య రాజ్ సింగ్ ఎక్స్‌లో పేర్కొన్నారు