తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్షను కేటీఆర్ డ్రామాగా అభివర్ణించడాన్ని ఆయన ఖండించారు. కేటీఆర్ పేరే డ్రామారావు అని ఎద్దేవా చేశారు. కేటీఆర్ కుటుంబంలోనే నాటకాలు జరుగుతున్నాయని, ఒకరు బీసీలకు అనుకూలంగా, మరొకరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.

