జేఈఈ మెయిన్ -2026 సెషన్ 1 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం సాయంత్రం విడుదల చేసింది. జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జరిగిన బీఈ, బీటెక్ పేపర్ 1 ఫలితాలను ఎన్టీఏ వెల్లడించింది. 13,04,653 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 96.26 శాతం మంది ఉత్తీర్ణణత సాధించినట్టు ఎన్టీఏ తెలిపింది. కాగా ఈసారి పేపర్ 1లో 12 మంది 100 పర్సంటైల్ సాధించారు. బాలికలు ఎవరూ 100 పర్సంటైల్ సాధించలేకపోయారు. https://jeemain.nta.nic.in

