ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై భారీ దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ తెలిపింది. సైనిక మౌలిక సదుపాయాలు సహా కార్యాలయాల లక్ష్యంగా దాడులు చేస్తున్నామని వెల్లడించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ నేవీ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్లు IDF ఎక్స్‌లో పోస్టు చేసింది. పౌర నౌకలపై ఉగ్రదాడులకు IRGC నేవీ కారణమని ఆరోపించింది. ఇరాక్, లెబనాన్, యెమెన్‌లోని మిలిటెంట్ సంస్థలకు సముద్ర మార్గం ద్వారా ఆయుధాలు సరఫరా చేసిందని తెలిపింది

