
హర్యానాలోని రోహ్తక్ జిల్లా సైబర్ సెల్లో పనిచేస్తోన్న ASI సందీప్ ఇవాళ తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ASI తన సూసైడ్ నోట్లో, ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ IPS అధికారి వై. పురాణ్ కుమార్ అత్యంత అవినీతికి పాల్పడ్డాడని, అతని అక్రమాలపై తగినన్ని ఆధారాలు ఉన్నాయని తన సూసైడ్ నోట్ లో ఎఎస్ఐ రాశారు. కుల వివక్షను ఉపయోగించుకుని పురాణ్ కుమార్ మొత్తం వ్యవస్థను హైజాక్ చేశాడని, నిజాయితీపరులైన అధికారులను ఎంతో మందిని వేధించాడని ఆయన ఆరోపించారు.