
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) మధ్య నెలకొన్న టిక్కెట్ల వివాదం, బెదిరింపుల ఆరోపణల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు ఏ. జగన్మోహన్ రావును CID అధికారులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు సంబంధించిన కాంప్లిమెంటరీ టిక్కెట్లు, పాస్‌ల కేటాయింపులో జరిగిన అక్రమాలు, బ్లాక్‌మెయిలింగ్‌పై ఎస్ఆర్హెచ్ యాజమాన్యం తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.