
ఈ వార్తలను అధికారికంగా సైన్యం గానీ, బాధ్యతగల వ్యక్తులు గానీ ఇపపటి వరకూ ధృవీకరించలేదు. కొన్ని మీడియా కథనాల ప్రకారం, INS విక్రాంత్ నుండి ప్రయోగించిన క్షిపణులు నేరుగా పాకిస్తాన్ నౌకాదళ స్థావరాలను, వారి ఉన్నతాధికారుల ప్రధాన కార్యాలయాలు, యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయని చెబుతున్నారు. కరాచీ ఓడరేవుపై వరుసగా 12 పేలుళ్లు సంభవించడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. అగ్ని జ్వాలలు ఎగసిపడ్డాయి, ప్రజలు ప్రాణాలను రక్షించుకోవడానికి ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు.