
అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసాలపై కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. గత రెండు రోజులుగా భారత స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. ఈ రోజు కూడా ట్రేడింగ్ ప్రారంభం నుంచే మార్కెట్లు క్షీణతలో ఉన్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్ల క్షయంతో 81,800 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 80 పాయింట్లు తగ్గి 25,100 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోల్చితే రూపాయి 7 పైసలు పడిపోయి 88.80 వద్ద రికార్డు కనిష్ఠాన్ని తాకింది. ఇదే సమయంలో అమెరికా మార్కెట్లు కూడా ప్రతికూల ధోరణిని చూపించాయి.