
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల DA విడుదలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన GO నంబర్ 60, 61 లలో మార్పులు చేసింది చంద్రబాబు సర్కారు. ప్రభుత్వ ఉద్యోగులకు నేటి నుంచి ఏడాది లోపు మూడు వాయిదాలలో DA బకాయిలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ మొత్తాన్ని ఉద్యోగుల GPF ఖాతాల్లో జమ చేయాలని GO లో సవరణలు తీసుకొచ్చారు. CPS ఉద్యోగులు, పెన్షనర్ లకు ఏడాది లోపు మూడు వాయిదాలలో చెల్లించాలని ఆదేశాలిచ్చారు. కొంచెంసేపటి క్రితం ఏపీ ప్రభుత్వం కొత్త GO విడుదల చేసింది.