loader

మోటాలో భారీగా ఉద్యోగుల తొలగింపు..

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు చెందిన మెటా సంస్థ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగం నుండి 600 మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం 2025లో తీసుకోవడం ద్వారా, మెటా తన కార్యకలాపాలను వేగవంతంగా మరియు సమర్థవంతంగా నిర్వహించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. US మీడియా, ముఖ్యంగా వాల్ స్ట్రీట్ జర్నల్ మరియు న్యూయార్క్ టైమ్స్, ఈ విషయాన్ని వివరించారు.

అమెరికాలో ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి..

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 21 ఏళ్ల భారతీయుడు జస్ప్రీత్ సింగ్ మద్యం మత్తులో ట్రక్కు నడుపుతున్నాడని,బ్రేక్‌లు కూడా వేయలేదని, అందుకే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుడైన ట్రక్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. జస్ప్రీత్ సింగ్‌కు అమెరికాలో చెల్లుబాటు అయ్యే ఇమ్మిగ్రేషన్ హోదా లేదని యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) నిర్ధారించింది. అతను 2022లో దక్షిణ సరిహద్దు […]

5 లక్షల ఉద్యోగులకు అమెజాన్ లేఆఫ్‌లు

ఏఐ వచ్చి ఇప్పటికే చాలా ఉద్యోగాలను సొంతం చేసేసుకుంది. దిగ్గజ కంపెనీల్లో ఒకటైన అమెజాన్ కూడా ఈ ఏడాది భారీగా ఉద్యోగాలను పీకిపారేసింది. అమెజాన్ ఆటోమేషన్ బృందం దీనిపై పని చేస్తోంది. నెమ్మదిగా మనుషుల స్థానంలో రోబోలను పనిలోకి తీసుకువస్తోంది. 2027 నాటికి అమెరికాలో 1, 60,000 కంటే ఎక్కువ మందిని ఉద్యోగాలను తప్పించడం లేదా..నియమించకుండా ఉండేందుకు అమెజాన్ ఆటోమేషన్ బృందం పని చేస్తోంది. ఇది 2033 నాటికి దాదాపు 6లక్షల రోబోలు అమెజాన్‌లో పని చేస్తాయని […]

ర‌ష్యా దాడుల్లో చిన్నారులు స‌హా ఏడు మంది మృతి : జెలెన్‌స్కీ

ర‌ష్యా తాజాగా చేప‌ట్టిన డ్రోన్‌, మిస్సైల్ దాడుల్లో ఏడు మంది మ‌ర‌ణించిన‌ట్లు ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వోల్డోమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. మృతుల్లో ఇద్ద‌రు చిన్నారులు కూడా ఉన్న‌ట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లోని రెండ‌వ పెద్ద న‌గ‌ర‌మైన ఖార్కివ్‌లో ఉన్న కిండ‌ర్‌గార్డెన్‌పై అటాక్ జ‌రిగింది. వ‌రుస దాడుల వ‌ల్ల కీవ్‌లో కూడా న‌ష్టం జ‌రిగింది. చిన్నారుల‌తో క‌లిపి సుమారు 26 మంది గాయ‌ప‌డిన‌ట్లు జెలెన్‌స్కీ చెప్పారు. అయితే బుదాపెస్ట్‌లో పుతిన్‌తో జ‌ర‌గాల్సిన భేటీని డోనాల్డ్ ట్రంప్ ర‌ద్దు చేసుకున్నారు.

ఓపెన్​ఏఐ నుంచి కొత్త బ్రౌజర్

ఏఐ ఆధారిత చాట్​బాట్ చాట్​జీపీటీని తీసుకొచ్చి సంచలనం సృష్టించిన ఓపెన్​ఏఐ ఇప్పుడు సరికొత్త బ్రౌజర్​ను పరిచయం చేసింది. దీని పేరు “చాట్​జీపీటీ అట్లాస్”. దీన్ని సంభాషణాత్మక AI ఆధారంగా రూపొందించారు. ఈ ఏఐ పవర్డ్ బ్రౌజర్.. వెబ్‌తో నావిగేషన్, ఇంటరాక్టింగ్ కోసం చాట్​జీపీటీని తన కోర్ ఇంటర్‌ఫేస్‌గా అనుసంధానిస్తుంది అట్లాస్ ఇప్పటికే అంటే నేటి నుంచి MacOS వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. కంపెనీ త్వరలో దీన్ని Windows, మొబైల్ ప్లాట్‌ఫామ్‌లకు విస్తరించే యోచనలో ఉంది.

ఢీకొన్న రెండు బ‌స్సులు.. 63 మంది మృతి

ఆఫ్రికా దేశం ఉగాండాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. రెండు బ‌స్సులు ఢీకొన్న ఘ‌ట‌న‌లో 63 మంది మ‌ర‌ణించారు. ఓవ‌ర్ టేకింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. కిరియాన్‌డోంగో జిల్లాలోని కంపాలా – గులా హైవేపై ఈ ప్ర‌మాదం జ‌రిగింది. మంగ‌ళ‌వారం రాత్రి ఈ ద‌ర్ఘ‌ట‌న జ‌రిగింది. చెయిన్ రియాక్ష‌న్‌లో ప‌లు వాహ‌నాలు ధ్వంసం అయ్యాయి. అనేక మంది గాయ‌ప‌డ్డారు. రెండు బ‌స్సుల్లో ఉన్న ప్ర‌యాణికులు అంద‌రూ ప్రాణాలు కోల్పోయారు.

ఉద్యోగుల తొలగింపుల మధ్య 22 శాతం పెరిగిన సత్య నాదెళ్ల వేతనం

ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో టెక్ రంగంలో ఉద్యోగులను తొలగిస్తున్నారు. అయితే దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వేతనం ఈ ఏడాది ఏకంగా 22 శాతం పెరిగింది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కొత్త వేతనం 96.5 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో ఇది సుమారుగా రూ.847 కోట్లు. గత ఏడాది సత్యనాదెళ్ల వేతనం 79 .1 మిలియన్ డాలర్లుగా ఉన్నది. వేతనంలో ఎక్కువ భాగం 84 మిలియన్లకు పైగా విలువైన స్టాక్ […]

థాంక్యూ ట్రంప్.. దివాళీ ఫోన్ కాల్‌కు ప్రధాని మోదీ స్పందన..

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ధన్యావాదాలు తెలియజేశారు. ట్రంప్ శుభాకాంక్షల నేపథ్యంలో ఎక్స్ ద్వారా ప్రధాని మోదీ స్పందించారు. ‘మీ ఫోన్ కాల్‌కు, దీపావళి శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు ప్రెసిడెంట్ ట్రంప్. ఈ వెలుగుల పండుగ నాడు, మన రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచాన్ని ఆశతో ప్రకాశింపజేయడాన్ని కొనసాగించాలి. ఇరు దేశాలు అన్ని రకాల ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలి’ అని మోదీ ట్వీట్ చేశారు

ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థపై రష్యా బీభత్సం

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ దాడులు జరిపి దేశాన్ని చీకట్లోకి నెట్టింది. మంగళవారం రాత్రి రష్యా సైన్యం ఉక్రెయిన్ విద్యుత్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున క్షిపణులు మరియు డ్రోన్ల దాడులు చేసింది. ఈ దాడుల కారణంగా అనేక పవర్ గ్రిడ్‌లు, విద్యుత్ కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాడుల వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రాజధాని కీవ్, అలాగే ల్వీవ్, ఒడెస్సా, జాపోరిజియా, రివ్నె, వోలిన్ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక […]

న్యూయార్క్ లోని గూగుల్ ఆఫీస్ క్లోజ్ ఎందుకంటే ?

గూగుల్ ఆఫీస్ మన్‌హాటన్‌లో తాత్కాలికంగా మూతపడిన నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సూచన న్యూయార్క్‌లోని మన్‌హాటన చెల్సియా క్యాంపస్‌లో గూగుల్ ఆఫీస్ తాత్కాలికంగా మూతపడింది. ఆఫీసులో ఏర్పడిన నల్లుల సమస్యను ఎదుర్కోవడానికి కంపెనీ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేయాలని సూచించింది. ఈ నెల 19న ఆఫీసు మూతపడినప్పటి నుంచి, నల్లుల సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉద్యోగులు కార్యాలయానికి రాకూడదని గూగుల్ పేర్కొంది. మన్‌హాటన్ గూగుల్ ఆఫీస్‌లో ప్రస్తుతం నల్లుల నివారణ చర్యలు చేపట్టబడుతున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON